కేవలం 20 నిమిషాల్లో మెడ నలుపును మాయం చేసే మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ మీకోసం!

సాధారణంగా కొందరి మెడ రంగు ముఖం తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది.హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.

 The Most Powerful Remedy To Get Rid Of A Dark Neck In 20 Minutes , Home Remedy,-TeluguStop.com

దీని కారణంగా కాంతిహీనంగా కనిపిస్తుంటారు.ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన మెడ నలుపు( Neck black) నుంచి విముక్తిని పొందలేకపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.కేవలం ఇర‌వై నిమిషాల్లోనే మెడ నలుపును మాయం చేసే మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.

ఈ రెమెడీతో చాలా సులభంగా మెడ నలుపును నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడి ఏంటో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు Eno పౌడర్( Eno powder ) ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ( Turmeric )మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసుకుని ప‌ది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర‌ నిమ్మ చెక్కను తీసుకుని మెడను కనీసం మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సున్నితంగా రబ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మెడ నలుపు చాలా వరకు మాయం అవుతుంది.రెండు రోజులకు ఒకసారి ఏ రెమెడీని పాటిస్తే మెడ కొద్ది రోజుల్లోనే తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.మెడ నలుపును వదిలించడానికి ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కాబట్టి ఎవరైతే మెడ నలుపు తో తీవ్రంగా బాధపడుతున్నారో తప్పకుండా వారు ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube