నల్లగొండ జిల్లా: తలాపున వరద కాలువ నీరు ప్రవహిస్తున్నా అధికారుల ముందుచూపు లేని కారణంగా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లుగా ఉందని నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలోని చెరువుల పరిస్థితి ఉండేది.ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో లెవల్ వరద కాలువ నిర్మాణంలో భాగంగా చెరువుల ఉపరితలం ఎత్తులో వరద కాలువ ఉపరితలం లోతులో ఉండగా చెరువులలోకి నీరురాక అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా మారింది.
దీనితో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు,రైతులు వరద కాలువకు నీరు వచ్చిన ప్రతిసారి చెరువులను నింపేందుకు భగీరథయత్నం చేయాల్సివస్తుంది.
వర్షభావం,భూగర్భ విద్యుత్ మోటర్లపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులు ప్రతి ఏడాది వరుణ దేవుని కరుణ కోసం ఎదురు చూస్తుండేవారు.
లోతట్టు లో ఉన్న వరద కాలువ నీటిని ఎత్తిపోసేందుకు గ్రామస్తులు రైతులు గ్రామ అభివృద్ధి నిధులతో వరద కాలువ నీటిని చెరువులో నుంచి ఎత్తి పోసేందుకు గాను 5-సెవెన్ హెచ్.పి విద్యుత్ మోటార్లను కొనుగోలు చేశారు.
తోపుచర్ల రైతుల పరిస్థితిని గమనించిన గ్రామానికి చెందిన యువనేత గడ్డం పురుషోత్తంరెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేసి సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించడం జరిగింది.
దీనితో వరదకాలువ నుండి చెరువులోకి నీటిని ఎత్తిపోసే విద్యుత్ మోటర్లు సజావుగా నడిచేందుకు మార్గం సుగుమం అయింది.
విద్యుత్ శాఖ అధికారులు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రతిపాదికన నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయగా యువజన కాంగ్రెస్ నాయకులు గడ్డం పురుషోత్తంరెడ్డి స్థానిక రైతులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోలెవల్ వరద కాలువ నీటిని చెరువులోకి ఎత్తి పోసేందుకు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లకు
అవసరమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లకు సకాలంలో పనులు పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులకు,సహకరించిన ప్రతిఒక్కరికి రైతులు, గ్రామస్తుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ మోటార్ల సహకారంతో వరద కాలువలలోని నీటిని చెరువులోకి ఎత్తిపోయడం తో తోపుచర్ల గ్రామంలోని రెండు చెరువులు నిండి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు.యాసంగి సీజన్లో విద్యుత్ బోరుబావులపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్న వ్యవసాయం సజావుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.