హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వ్యక్తిని ఢీకొన్న అనంతరం రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద దిమ్మను కారు ఢీకొట్టిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.వెంటనే గమనించిన స్థానికులు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు.
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణదిగా గుర్తించారు.
అలాగే ప్రమాద సమయంలో కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడుపుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.