ఎన్డీఏ కూటమికే తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఏపీలోని టీడీపీ( TDP ) ఎంపీలు అన్నారు.రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం నుంచి మద్ధతు కావాలని తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) అంశంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించుకోవాలని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.భారీ మెజార్టీ సాధించడానికి పరోక్షంగా వైసీపీ కూడా కారణమేనని వారు చెప్పారు.
కాగా రేపు ఢిల్లీలో బీజేపీ, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీల సమావేశం జరగనుంది.ఇందుకోసం బీజేపీతో పాటు ఎన్డీఏ పక్ష ఎంపీలు ఢిల్లీకి పయనం అవుతున్నారు.
అయితే రేపటి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీల సమావేశంలో ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని బీజేపీ మిత్రపక్ష ఎంపీలు ఎంపిక చేయనున్నారు.