పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి...ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ చెరువు పై గ్రామస్తులతో పర్యావరణ పై ప్రతిజ్ఞ చేసి అనంతరం ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీవో జయశీల లు.అనంతరం విలాసాగర్ లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా పర్యావరణ కంపోస్ట్ ఎరులపై అవగాహన కల్పించారు.

 Everyone Should Work For Environmental Protection Mpp Parlapalli Venugopal , Mpp-TeluguStop.com

అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీవో జయశీలాలు మాట్లాడుతూపర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ,ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందిగలమని అన్నారు.స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.

ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ,ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు.ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు.

భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని , భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే నని , మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు.అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానివేయాలని అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు విలాసాగర్ గ్రామంలో గ్రామం నుండి సేకరించిన చెత్త ద్వారా తయారు చేయడం జరుగుతుందని రైతులు దీని సద్విని చేసుకొని మంచి దిగుబడి పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శి గంగ తిలక్, ఏపీవో సబిత, కార్యదర్శులు రాజ సులోచన ,శ్రీనివాస్ , ఏఈఓ లు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube