టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చిరంజీవి సురేఖ( Chiranjeevi , surekha) దంపతుల అనుబంధం గురించి చాలా మంది చెబుతూ ఉంటారు.అలాగే కుటుంబంలో కూడా చిరంజీవి కన్నా సురేఖ అందరితో చాలా కలివిడిగా ఉంటారట.
అంతేకాదు అందరిని ఒక తాటిపై ఉంచే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంటారట.ఇంట్లో అందరూ ఆమెకు మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తారట.
ముగ్గురి తోటి కోడలలో పెద్ద కోడలు అయిన సురేఖ మిగతా వారందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటారని చాలా సార్లు ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అయితే తన తల్లి తర్వాత తల్లి అంతటి వ్యక్తి సురేఖ వదిన అని ఎన్నోసార్లు అన్నారు.
అయితే సురేఖ మాటలకు చిరంజీవి చాలాసార్లు నోచ్చుకుంటారట.ఆ కథ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అలాగే ఎంతో సున్నితంగా విషయాలను డీల్ చేసే సురేఖ చిరంజీవితో మాత్రం చాలా ముక్కుసూటిగా ఉంటారట.చిరంజీవికి కావాల్సిన బట్టలు మిగతా యాక్సస్సరీస్ అన్ని ఆమె దగ్గరుండి మరి తీసుకుంటారట.తనకు ఎప్పుడైనా చిరంజీవి వేసుకున్న బట్టలు నచ్చకపోతే మొహం మీదే మీ బట్టలు అస్సలు బాగోలేదు వెళ్లి మార్చుకోండి అంటారట.చిరంజీవికి నచ్చిన సరే సురేఖ చెప్పడంతో ఆయన కూడా మార్చుకుంటారట.
ఇక తన జీవితంలో పెద్ద క్రిటిక్ ఎవరైనా ఉన్నారు అంట అది కేవలం సురేఖ అంటూ చిరంజీవి ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.
ఇక సినిమాకి సంబంధించిన విషయాలలో ఏదైనా జడ్జిమెంట్ చేయాల్సి వచ్చిన, రషేస్ చూడాల్సి వచ్చిన ప్రతిసారి సురేఖతో కలిసి చిరంజీవి చూస్తారట ఎందుకంటే ఆమె జడ్జిమెంట్ అంత చక్కగా ఉంటుంది అట చిరంజీవి నోచుకున్నా సరే ఆమె ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పడానికి ఇష్టపడతారట.ఆమె అభిప్రాయం 99% ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుందనీ చిరంజీవి చెబుతున్నారు.ఒక్కోసారి ఆమె కటువుగా మాట్లాడే విధానానికి చిరంజీవి హార్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయట.
కానీ ఆ తర్వాత ఆమె చెప్పిందే కరెక్ట్ కాబట్టి కూల్ అయిపోతారట.