దీపావళి రోజు ఆడపడుచులు ఇంట్లోవారికి హారతులు ఎందుకిస్తారో తెలుసా?

ఆశ్వీయుజ మాసంలో కృష్ణపక్షంలో ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగలలో దీపావళి పండగ ఒకటి.ఈ పండుగను సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు.

 Do You Know Why Females Give Harathi On Diwali Diwali, Festiva, Worship, Hindu B-TeluguStop.com

ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందుతారు.ఈ క్రమంలోనే నరకచతుర్దశి రోజు ఈ పండుగ రోజున ఇంటి ఆడబిడ్డలు ఇంటిలో ఉన్నటువంటి వారికి తలంటు స్నానం చేసాక, వారికి హారతులు ఇస్తూ ఉంటారు.

ఇలా హారతులు ఇవ్వడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

నరక చతుర్దశి రోజు వేకువ జామున నిద్ర లేచి సూర్యోదయానికి ఒక గంట ముందు దేవతలకు బ్రాహ్మణులకు తల్లికి గోవుకి హారతి ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలని శాస్త్రం చెబుతోంది.

ఆతర్వాత అభ్యంగన స్నానం చేసి దీపారాధన అనంతరం మన ఇంట్లో ఉన్న సోదరులకు తలకు నువ్వుల నూనె రాసి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది హారతులు ఇవ్వాలి.ఇలా ఆడపడుచు హారతి ఇవ్వడం వల్ల వారి మధ్య ఉన్న అనుబంధం పదికాలాలపాటు చల్లగా ఉంటుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే హారతులిచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సోదరులు వారి సోదరీమణులకు కానుకలు ఇస్తారు.

దీపావళి సందర్భంగా అకాల మృత్యు దోషాలు తొలగిపోవడానికి దీపావళి పండుగ సందర్భంగా దీప దానం చేస్తారు.ఆ తర్వాత అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ పండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారు.ఇక ఈ పండుగ రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాకాయలు కాలుస్తూ, ఇల్లు మొత్తం దీపాలను అలంకరించి ఎంతో ఘనంగా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube