నవనారసింహ క్షేత్రాలు, పంచద్వారకల పేర్లు ఏమిటో తెలుసా?

మనకు నవ నారసింహ క్షేత్రాలు, పంచ ద్వారకల పేర్లు పెద్దగా తెలియదు.ఇందులో కొన్నింటి పేర్లు తెలిసి ఉండవచ్చు.

 Do You Know Nava Narasima Ksethralu And Pancha Dwarakas Names Details, Narasimha-TeluguStop.com

కానీ పూర్తిగా వాటి పేర్లు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అయితే మనం ఇఫ్పుడు నవ నారసింహ క్షేత్రాలు, పంచద్వారకల పేర్లు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

నవ నారసింహ క్షేత్రాలు అంటే తొమ్మిది నరసింహ క్షేత్రాలు అని అర్థం.వీటిని నిర్ణయించడంలో మొత్తం మూడు పక్షాలు ఉన్నాయి.అంటే మూడు పక్షాల్లో తొమ్మిది క్షేత్రాలు గురించి వివరించారు.అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మొదటి పక్షం.మంగళగిరి, అహోబిలం, సింహాచలం అంతర్వేది, వేదాద్రి, యాదవాద్రి, కదిరి, నగరి పట్టణాల్లో ఉన్న నరసింహ స్వామి క్షేత్రాలు.

రెండో పక్షంలో… కదిరి, వేంకటాద్ర, నగరి, వేదాద్రి, భార్గపూటు, ముట్టెమళ్ల, కానుగమాను, అహోబిలం, కోరుకొండ.ఇంక మూడో పక్షంలో… అహోబిలం, కదిరి, పెన్నాహోబలం, కోరుకొండ, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, సింగరాయకొండ, ధర్మపురి. 

ఈ మూడు పక్షాల్లోనూ అనేక క్షేత్రాల పేర్లు పునరుక్తమయ్యాయి.ఆ విషయం అందరూ గ్రహించే ఉంటారు.అయితే అలాగే పంచ ద్వారకల పేర్లు తెలుసుకుందాం.పంచ ద్వారకలు అనగా ఐదు ద్వారకలు.

అందులో మొదటిది గోమతి.రెండోది భేటి.మూడోది కాకడి.నాలుగోది శ్రీనాథం.ఐదవది మోక్ష ద్వారక. చాలా మంది పంచ ద్వారకల నవ నారసింహ క్షేత్రాలను దర్శించుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube