ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.క్రమం తప్పకుండా ముల్లంగి తీసుకునే వారు ఎంతో ఆరోగ్యం గాను మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారట.
అంతేకాదు ముల్లంగిలో క్యాన్సర్ ని నివారించే యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయట.దీనిలో విటమిన్ ‘సి’ ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉండటతో రోగకారక క్రిములు శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వాటిని నాశనం చేస్తాయట.
రక్తాన్ని శుద్ధి చేయడంలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది.అంతేకాదు లివర్, కడుపు ల్లో ఉండే సమస్యల్ని కంట్రోల్ చేస్తుంది.ముల్లంగి ఆకులతో విరుచనాలని కంట్రోల్ చేయవచ్చు.చర్మ వ్యాధులని కూడా నయం చేసుకోవచ్చు.
ఉద్యోగులు కానీ, ఎక్కువసేపు దూరాలు ప్రయాణం చేసేవారు ఎక్కువగా భాదపడేది ఫైల్స్ సమస్యతో.దీనికి ముల్లంగితో చెక్ పెట్టచ్చు.ముల్లంగిని రోజువారీ పద్దతిలో తినడంవలన వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.కందిరీగలు, తేనెటీగలు కుట్టినప్పుడు వచ్చే వాపు, మంట ప్రదేశంలో ముల్లంగి రసం రాస్తే నెప్పి చిటికెలో పోతుంది.