ఎసిడిటీ.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కున్న వారే.
ఎసిడిటీ ఉన్న వారు ఏదైనా ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, తేన్పులు, ఛాతిలో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.దీంతో తిన్న తర్వాత బాధ పడటం కంటే.
తినకుండా ఉండటమే మంచిదని ఫీల్ అవుతుంటారు.అందుకే, ఎసిడిటీ బాధితులు ఏవైనా ఆహారాలు తీసుకునేందుకు ఎప్పుడూ జంకుతుంటారు.
అయితే ఎసిడిటీ సమస్యలు ఉన్న వారు కొన్ని తప్పులు చేసి.మరిన్ని ఇబ్బందులకు గురవుతుంటారు.
మరి తప్పులు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.సాధారణంగా నేటి కాలంలో చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది.అయితే ఎవరైతే ఎసిడిటీ సమస్యతో బాధ పడతారో.అలాంటి వారు స్మోకింగ్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
ఎందుకంటే.సిగరెట్ లో ఉండే నికోటిన్ అనే కంటెంట్ పొట్టలో అదనపు యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది.
ఫలితంగా ఎసిడిటీ మరింత తీవ్రంగా మారుతుంది.కేవలం ధూమపానమే కాదు.
మధ్యపానికి కూడా ఎసిడిటీ బాధితులు దూరంగానే ఉండాలి.
అలాగే చాలా మంది ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.
అలా చేయడం యాసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.దీంతో ఎసిడిటీ ముప్పు ఎక్కువవుతుంది.
అందుకే ఎప్పుడూ ఆహారాన్ని తక్కువ మోతాదులో మూడు, నాలుగు సార్లు తీసుకోవాలి.ఎసిడిటీ బాధితులు కాఫీ, టీ, శీతలపానీయాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు నీరు ఎక్కువగా తీసుకోవాలి.లేదంటే శరీరం డీహైడ్రేట్ అయ్యి ఎసిడిటీకి దారి తీస్తుంది..
ఇక ఎసిడిటీ సమస్య నుంచి క్షణాల్లోనే ఉపశమనం పొందాలనుకునే వారు.భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోవడం లేదా భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి భోజనం తర్వాత తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.