బట్టతలకు దూరంగా ఉండాలనుకుంటే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే!

బట్టతల( baldness ).పురుషులను మానసికంగా కుంగదీసే జుట్టు సమస్యల్లో ఒకటి.

 Best Way To Avoid Baldness , Baldness, Hair Toner, Hair Care, Hair Care Tips, Th-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, డిప్రెషన్, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది.క్రమంగా కొందరు బట్టతల బారిన పడుతుంటారు.

బట్టతల కారణంగా చాలామంది పురుషులు తీవ్రమైన వేదనకు గురవుతుంటారు.అందులోనూ పెళ్లి కానీ పురుషులు మరింత ఎక్కువగా బాధపడుతుంటారు.

అయితే బట్టతల వచ్చాక బాధపడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.ముఖ్యంగా బట్టతలకు దూరంగా ఉండాలంటే అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్( Hair toner ) ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి రెండు సార్లు ఈ హెయిర్ టోనర్ ను వాడితే బట్టతల దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Thick-Telugu Health

ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్క( ginger ) తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ ను పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము, గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ), కొన్ని డ్రై రోజ్ మేరీ ఆకులు( Dry Rose Mary leaves ), వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Thick-Telugu Health

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఈ హెయిర్ టోనర్ ను జుట్టు కుదుళ్లకు ఒకటి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.రెండు లేదా మూడు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ హెయిర్ టోనర్ ను వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కాబట్టి బట్టతలకు దూరంగా ఉండాలనుకునే పురుషులు తప్పకుండా ఈ హెయిర్ టోనర్ ను వాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube