సాధారణంగా చాలా మంది ప్రజలు ఉదయం బ్రేక్ ఫాస్ట్( Breakfast ) లో నూనె ఆహార పదార్థాలు, కాఫీలు, టీలు ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటారు.కానీ ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits ) ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో ఈ మజ్జిగ( Butter Milk ) తీసుకోవడం ఎంతో అవసరం.ఇందులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి.
దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిని పడకుండా ఉంటారు.అయితే మజ్జిగ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్స్( Pro Biotics ) జీర్ణ క్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే మజ్జిగలో ఉంటే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి జలుబు, ఫ్లూ వంటి అంటూ వ్యాధులను నీవరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ఇది బరువు తగ్గాలనుకునే( Weight Loss ) వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మజ్జిగ మిమల్ని ఎక్కువ సేపు హైడ్రేట్ గా ఉంచుతుంది.అలాగే మజ్జిగ తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి.ఇది చర్మాన్ని సాఫ్ట్ గా కాంతివంతంగా ఉండలా చేస్తుంది.
అదే విధంగా ఎండాకాలంలో చాలా మందికి ఎదురయ్యే మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది.అలాగే పొట్ట ఆరోగ్యాన్ని రక్షించింది.అలాంటి సమయంలో మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.దీని వలన శరీరం త్వరగా చల్లబడుతుంది.