Arya Bommarillu : ఆర్య సినిమా క్లైమాక్స్ కి, బొమ్మరిల్లు సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

Relation Between Arya Movie And Bommarillu

2004వ సంవత్సరం దిల్ రాజుకి( Dil Raju ) సుకుమార్( Sukumar ) ఆర్య సినిమా కథ చూపించి ఎలాగోలా ఓకే చేయించాడు.చేతుల మీదుగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఆర్య సినిమాతో సుకుమార్ మొట్టమొదటి సారి దర్శకుడిగా మారాడు.

 Relation Between Arya Movie And Bommarillu-TeluguStop.com

అనుకున్న షెడ్యూల్ ప్రకారం అంతా సాఫీ గానే సాగుతోంది.షూటింగ్ చివరి రోజు.

రానే వచ్చింది.బాలన్స్ తియ్యాల్సిన షార్ట్ విషయం గురించి దిల్ రాజు లోపల ఏదో ఒక టెన్షన్ నడుస్తోంది అంతలో సుకుమార్ దిల్ రాజు గదిలోకి వచ్చాడు.

సుకుమార్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar )సైతం దిల్ రాజు దగ్గరికి వచ్చాడు.సుకుమార్ దిల్ రాజుల టెన్షన్ గమనించిన భాస్కర్ మీరు టెన్షన్ పడకండి సార్.

మేమంతా చూసుకుంటాం ఈరోజు రాత్రి తీయాల్సిన సీన్స్ అన్నీ కూడా లెక్కచేసుకుని రేపు సాయంత్రం లోపు పూర్తి చేసే తీరుతాం అంటూ మాటిచ్చాడు.

Telugu Arya, Bhaskar, Bommarillu, Dil Raju, Sukumar, Tollywood-Telugu Stop Exclu

అలా తెల్లవారులు భాస్కర్ మరియు సుకుమార్ కూర్చుని తీయాల్సిన షార్ట్స్ 46 అంటూ లెక్క తేల్చారు.ఇక భాస్కర్ అప్పటివరకు సుకుమార్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ వచ్చాడు ఆర్య ( Arya )సినిమా కోసం.సుకుమార్ కి దిల్ రాజు సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి సుకుమార్ కంటే కూడా భాస్కర్ ఎంతగానో సంతోషించాడు.

ఎందుకంటే వీరిద్దరూ చాలా ఏళ్లుగా కలిసి పని చేస్తూ ఉన్నారు.ఇక అనుకున్న ప్రకారం ఒక రోజులోనే 46 షాట్స్ పూర్తి చేశారు.సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది.షూటింగ్ ఆఖరి రోజున దిల్ రాజు భాస్కర్ కి ఒక మాట ఇచ్చాడు.

నీ మొదటి సినిమాకి నేనే నిర్మాతని కథ సిద్ధం చేసుకో అని చెప్పాడు.

Telugu Arya, Bhaskar, Bommarillu, Dil Raju, Sukumar, Tollywood-Telugu Stop Exclu

అనుకున్నదే తడవుగా ఒక నవల ఇచ్చి భాస్కర్ ని కథ రెడీ చేయమని చెప్పాడట దిల్ రాజు.కానీ ఆ నవల ఎందుకో సంతృప్తిగా అనిపించకపోవడంతో అదే విషయాన్ని దిల్ రాజుకు చెప్పాడు భాస్కర్.భాస్కర్ పై ఉన్న నమ్మకంతో నీ కథ నువ్వే సిద్ధం చేసుకో అంటూ చెప్పాడట వారంలో కథతో తిరిగి వస్తానని చెప్పి, వచ్చి బొమ్మరిల్లు కథ వినిపించి సినిమా తీసి నేడు బొమ్మరిల్లు నేతల ఇంటి పేరుగా మార్చుకున్నాడు భాస్కర్.

బొమ్మరిల్లు సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఎన్నో మార్పులు చేర్పులు చేసి చివరికి సినిమాను ఇండస్ట్రీ హిట్ గా మార్చాడు భాస్కర్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube