వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) మళ్ళీ మళ్ళీ అది తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి( YCP ) ఓటమి చెందడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించారు.
మొదటి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రెండో రోజు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటమికి గల కారణాలు ఏమిటి అనేది అడిగి తెలుసుకుంటున్నా.
నేతల అభిప్రాయాలకంటే వాటికి గల కారణాలను జగనే వారికి వివరించారట.క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ ఏంటనేది స్థానిక నాయకులకు ఒక అవగాహన ఉంటుంది.అయినా జగన్ మాత్రం తెప్పించుకున్న నివేదికలనే నాయకులకు వివరిస్తూ, నాయకులు చెప్పిన మాటలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదట.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తానే కారణమని , తన ఫోటో చూసే జనాలు ఓటు వేశారని జగన్ బలంగా నమ్మారు.
అప్పటి టిడిపి ప్రభుత్వం పై( TDP Government ) ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, జగన్ పాలన కూడా చూద్దామనే అభిప్రాయంతో జనాలు ఉండడంతో, 151 సీట్లతో అతిపెద్ద విజయాన్ని జగన్ అందుకున్నారు.అయితే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. 2019 నుంచి 24 వరకు జగన్ పాలనను జనాలు చూసేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను జగన్ అంచనా వేయలేకపోవడం , ఐ ప్యాక్ టీం( IPac Team ) అందించిన రిపోర్టులపైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్లారు.
దీంతో అనుకున్న ఫలితం తారుమారు అయింది.మొన్నటి ఎన్నికల్లో ఓటమికి తాను చేసిన తప్పులేననే విషయాన్ని జగన్ ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు.నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు వర్కౌట్ కావని, క్షేత్రస్థాయిలో జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది , నాయకుల ఫీడ్ బ్యాక్ ఏమిటనేది విశ్లేషించుకుని ముందుకు వెళ్తే ఈ తరహా ఫలితాలు వచ్చి ఉండేవి కావనే అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి.రాష్ట్రవ్యాపగా పర్యటిస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు.
అయితే స్థానిక నాయకులకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే వారు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు తలెత్తుతున్నాయి… ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది వారికి క్లారిటీ ఉంటుంది.
అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తానే పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాననే భావంతో జగన్ ముందుకు వెళితే మళ్ళీ ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇప్పటికే పార్టీ క్యాడర్ జగన్ వ్యవహార శైలి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాలంటీర్ వవస్థ( Volunteer System ) కారణంగా స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారని, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేడర్ ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లారని , ఇప్పటికైనా ఆ పద్ధతిని మార్చుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా నాయకులకు పూర్తి స్వేచ్ఛతో కూడిన బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీ నాయకులు నుంచి వ్యక్తం అవుతున్నాయి.