టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ( Rana ) ఒకరు.అయితే తాజాగా నటుడు రానా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోనమ్ కపూర్( Sonam Kapoor ) గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేగంగా నటి సోనమ్ కపూర్ పై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.ఇలా తన పట్ల ట్రోల్స్ రావడంతో రానా సోషల్ మీడియా వేదికగా నటి సోనం కపూర్ కు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.
అయితే పరోక్షంగా ఈమె దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారని తెలుస్తుంది.
రానా తనకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఈమె మాత్రం పరోక్షంగా రానా పట్ల చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే సోనమ్ కపూర్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ చేసిన పోస్ట్ రానాను ఉద్దేశించి చేశారని స్పష్టంగా తెలుస్తుంది.మెదడు తక్కువ ఉన్న వాళ్ళు ఇతర వ్యక్తుల గురించి చర్చించుకుంటారు కాస్త మెదడు ఉన్నవాళ్లు పనుల గురించి చర్చించుకుంటారు.
అదే గొప్పగా మెదడు ఉన్నవారు ఆలోచనల గురించి చర్చిస్తారన్న అర్థం వచ్చేలా ఉండే కొటేషన్ ఈమె షేర్ చేశారు.
ప్రస్తుతం సోనమ్ కపూర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ పోస్టు షేర్ చేస్తూనే మరో క్యాప్షన్ కూడా పెట్టారు.ఈ విషయం కొందరు వ్యక్తులు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ముఖ్యంగా ఇతరుల గురించి కల్పితాలు మాట్లాడేవారు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఈమె తెలియజేశారు.
ఇలా ఈమె చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్ట్ రానాని ఉద్దేశించి చేశారని స్పష్టంగా అర్థమవుతుంది.