తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మెగా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.చిరంజీవి రియల్ మెగాస్టార్ అంటూ.
ఆ తర్వాత అల్లు అర్జున్ గ్రేటెస్ట్ మెగాస్టార్ అంటూ తెలిపాడు.ఎందుకంటే కొందరు మెగా హీరోలు చిరంజీవి వల్ల స్టార్ హీరోలు అయ్యారని అన్నాడు.
కానీ అల్లు అర్జున్ మాత్రం తన సొంత టాలెంట్ తో హీరోగా ఎదిగాడని తెలిపాడు.పైగా ఆయన స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడు అంటూ ఒక హీరో కొడుకు హీరో అవుతాడు కానీ.
ఓ కమెడియన్ మనుమడు మాత్రం హీరోగా అయ్యాడంటూ పొగిడాడు.
ఇక తను కూడా బన్నితో సినిమా చేయాలని అనుకున్నాడట.
కానీ అది వర్కవుట్ కాలేదని తెలిపాడు.ఇక ఒక కమెడియన్ మనవడు హీరోగా కావడం జీర్ణించుకోలేని విషయం అంటూ తెలిపాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కి సంబంధం లేకుండా అల్లు అర్జున్ స్వతంత్రంగా స్టార్ హీరోగా ఎదిగాడు అంటూ అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఆయనను హీరోగా ఎన్నుకున్నారు అని తెలిపాడు.

అందుకే తను అల్లు అర్జున్ ను ఇండిపెండెంట్ స్టార్ అని అంటున్నాను అంటూ అల్లు అర్జున్ హీరో అవ్వడమే మెగాస్టార్ చిరంజీవికి పెద్ద షాక్ అని తెలిపాడు.రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సమయంలో కొందరు అల్లు అర్జున్ ని పట్టుకొని కొన్ని మాటలు అన్నారని కానీ అవన్నీ పట్టించుకోలేదని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు వర్మ.