స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్1 మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.బన్నీ ఈ సినిమా కోసం తన లుక్ మార్చుకోవడంతో పాటు ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించారు.
ఈ విధంగా నటించడం సులభం కాకపోయినా బన్నీ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు.బన్నీ, రష్మిక కాంబోలో తెరకెక్కుతున్న తొలి మూవీ పుష్ప కాగా సమంత స్పెషల్ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఈ స్పెషల్ సాంగ్ కు ఏకంగా మూడు కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ పడిన మేకప్ కష్టాలు అన్నీఇన్నీ కావు.
తన కేరీర్ లో ఏ పాత్ర కోసం పడని కష్టం బన్నీ పుష్పరాజ్ పాత్ర కోసం పడ్డారు.ముఖంతో పాటు మెడ, చేతులు, ఛాతీకి కూడా అల్లు అర్జున్ మేకప్ వేయించుకున్నారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఎడమ భుజాన్ని పైకి పెట్టుకుని నటించడం వల్ల వారం రోజుల పాటు భుజం నొప్పిగా ఉండేదని బన్నీ అన్నారు.ఆ తర్వాత తనకు అలవాటైందని బన్నీ చెప్పుకొచ్చారు.2005 వ సంవత్సరంలో, 2011 వ సంవత్సరంలో తన ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయని బన్నీ వెల్లడించారు.2011 సంవత్సరంలో సర్జరీ జరిగిన తర్వాత కోలుకోవడానికి ఏకంగా 11 నెలల సమయం పట్టిందని బన్నీ వెల్లడించారు.ఆ సర్జరీల వల్ల ఇప్పుడు నటించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని బన్నీ పేర్కొన్నారు.
భుజం బాగా నొప్పి ఉన్నా భరిస్తూ పుష్పరాజ్ పాత్రను చేశానని బన్నీ పేర్కొన్నారు.సినిమా కొరకు ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ పాత్రను చేశానని బన్నీ కామెంట్లు చేశారు.
బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.