డైరెక్టర్ ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లాఠీ. ఇందులో విశాల్, సునైన, ప్రభు, మనిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థపై రమణ, నంద నిర్మాతలుగా చేశారు.యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు.
బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో విశాల్ మురళీకృష్ణ అనే పాత్రలో కనిపిస్తాడు.
ఇక మురళీకృష్ణ ఓ సిన్సియర్ కానిస్టేబుల్.ఇక ఇతడికి కవి (సునైన) తో పెళ్లి జరగగా వీరికి ఒక కొడుకు ఉంటాడు.
కొడుకు పేరు రాజు.ఇక వీరిద్దరి ప్రపంచం అన్నట్లుగా బతుకుతాడు మురళీకృష్ణ.
అయితే మురళీకృష్ణ ఓ అత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యం చేయడంతో పై అధికారులు అతనిని సస్పెండ్ చేస్తారు.దీంతో తిరిగి తన ఉద్యోగం సంపాదించుకోవటానికి మళ్లీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు మురళి కృష్ణ.
ఇక చివరికి డీఐజీ కమల్ (ప్రభు) సహాయంతో తిరిగి ఉద్యోగంలో చేరుతాడు.
ఇక అప్పటినుంచి మురళి సిన్సియర్ గా పనిచేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు.అయితే ఓసారి కమల్ తన కస్టడీలో ఉన్న ఒక నేరస్థుడిని లాఠీతో కొట్టమని మురళికి చెబుతాడు.దాంతో మురళీకృష్ణ కమల్ తనకు ఉద్యోగం ఇచ్చాడన్న కృతజ్ఞతతో ఆ నేరస్తుడిని కొడతాడు.
ఆ తర్వాత ఆ నేరస్థుడు రౌడీ సూరా కొడుకు వీరా అని తెలుస్తుంది.ఆ తర్వాత వీరా మురళీకృష్ణ పై పగపడతాడు.అంతేకాకుండా ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు.ఇక చివరికి మురళీకృష్ణ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు.
అసలేం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఇక విశాల్ ఇప్పటికే పోలీస్ పాత్రలలో చాలా సినిమాలలో చేశాడు.ఇక ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రను పోషించాడు కాబట్టి ఈ పాత్రకు మంచి న్యాయం చేశాడు.యాక్షన్స్ సన్నివేశాలలో మాత్రం అదరగొట్టాడు.
ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా కనిపించాడు.ఇక సునైనా కూడా భార్య పాత్రలో అద్భుతంగా నటించింది.మిగతా నటినటులు కూడా పర్వాలేదన్నట్లుగా నటించారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికొస్తే.డైరెక్టర్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.జీవన్ శంకర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా అనేది రొటీన్ గా అనిపించినప్పటికీ కూడా కొన్ని పాయింట్లు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి.ఒక పోలీస్ ఆఫీసర్ తన భార్య పిల్లలను ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ సినిమా లైన్.ఇక ఈ సినిమాలో ఎటువంటి ట్విస్టులు కూడా కనిపించలేవు.సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
విశాల్ నటన, ఫస్టాఫ్, సంగీతం బావుంది.
మైనస్ పాయింట్స్:
ఎమోషన్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.రొటీన్ కథనం.రొటీన్ క్లైమాక్స్.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా రొటీన్ గా అనిపించినప్పటికీ కూడా విశాల్ నటన కోసం మాత్రం చూడవచ్చు.