మాళవిక మోహన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార.. అసలేం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నయనతార.

 Heroine Nayanthara Strong Counter Actress Malavika Mohanan About Comments ,nayan-TeluguStop.com

ఇక నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది నయనతార.

ఇకపోతే నయనతార తాజాగా నటించిన చిత్రం కనెక్ట్.తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నయనతార గతంలో తనపై ఒక హీరోయిన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.

నేను సినిమాకు అనుగుణంగా ఏది చెబితే అది చేస్తాను.డ్రెస్సింగ్ మేకప్ వాళ్ళు చెప్పిన విధంగానే అనుసరిస్తాను.

కానీ గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను.అందులో ఒక హీరోయిన్ నా మేకప్ గురించి కామెంట్స్ చేసింది.

ఆమె పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు.హాస్పటల్ సీన్ లో నేను మేకప్ లిఫ్టిక్ చక్కగా వేసుకోవడాన్ని ఆమె తప్పు పట్టింది.

కానీ నేను చెప్పేది ఒకటే సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది.కమర్షియల్ రియలిస్టిక్ సినిమాలు ఉంటాయి.

రియలిస్టిక్ చిత్రంలో లుక్స్ పరంగా జాగ్రత్తలు పాటించాలి.

Telugu Connect, Malavika Mohan, Nayanatara, Vignesh Sivan-Movie

కమర్షియల్ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్ ను ఇలాగే స్టైలిష్ గా చూపిస్తారు అని చెప్పుకొచ్చింది నయనతార.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ నయనతార అదంతా నటి మాళవిక మోహన్ గురించే కామెంట్స్ చేసిందని ఎందుకంటే గతంలో మాళవిక మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఒక నటి ఆసుపత్రి సన్నివేశంలో ఫుల్ మేకప్ వేసుకుంది అంటూ నయనతార ని తప్పు పట్టింది.కాబట్టి ఇప్పుడు నయనతార పేరు చెప్పకుండా మాళవిక మోహన్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube