సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకునే సినిమాలలో నటిస్తూ ఉంటారు ఒక స్టార్ హీరో ఇతర స్టార్ హీరోల సినిమాలలో కనిపించాలన్న కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాలలో మరొక హీరోలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి మన హీరోల ఇమేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి వరకు చేరుకుంది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో హీరోలా క్రేజ్ రేంజ్ కూడా పెరిగిపోయింది.
ఇలా ఒక్కో హీరో సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ కాకపోయినా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు గుర్తింపు పొందినటువంటి వారిలో మహేష్ బాబు( Mahesh Babu ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వంటి వారు కూడా ఒకరు వీరిద్దరూ నటిచిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాకపోయినా ఈ హీరోలకు మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పాలి.
ఇకపోతే ఇండస్ట్రీలో ఒక హీరో గెస్ట్ పాత్రలలో కనిపించిన లేదంటే ఒక సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ( Remuneration ) చార్జ్ చేస్తున్నారు కానీ మహేష్ బాబు మాత్రం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ లేకుండా ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలుస్తుంది.మరి మహేష్ బాబు వాయిస్ ఓవర్( Mahesh Babu Voice Over ) ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఇచ్చిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…
ఆ సినిమా మరేదో చదువు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి జల్సా.( Jalsa Movie ) ఈ సినిమా అప్పట్లో ఇలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసింది ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.అయితే ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు పని చేశారనే విషయం తెలిసి అప్పట్లో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా మరోసారి మహేష్ బాబు అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇలా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తే సపోర్ట్ చేయగా పవన్ కళ్యాణ్ సైతం మహేష్ బాబు సినిమాలకు ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానూ సహాయం చేస్తూ ఉంటారు.ఇలా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.వీరిద్దరూ ఇలా సహాయ సహకారాలు చేసుకోవడానికి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణమని తెలుస్తోంది.