13 ఏళ్ల కూతురిని రేప్ చేసి...ప్రతి ఇంట్లో జరిగేదే అని సమర్ధించుకున్నాడు ఆ నీచ తండ్రి.! అప్పుడు భార్య ఏం చేసిందంటే.?

దేశరాజధాని శివారు గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది.కన్న కూతురిపై ఓ తండ్రి ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు.

 13 ఏళ్ల కూతురిని రేప్ చేసి...ప్ర�-TeluguStop.com

సవతి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, కేసు దర్యాప్తులో విస్తూపోయే విషయాలు వెలుగు చూశాయి.

పోలీసుల కథనం ప్రకారం… బిహార్‌కు చెందిన సదరు వ్యక్తి, పటౌడీలోని ఓ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు.మొదటి భార్య చనిపోవటంతో రెండో వివాహం చేసుకున్నాడు.అతనికి నలుగురు పిల్లలు.

మొదటి భార్య కూతురి(13)పై కన్నేసిన ఆ మృగం గత ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు.పైగా బాలికను.

‘ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే.ప్రతీ తండ్రి తన కూతురితో లైంగిక సంబంధం ఉంటుంది.

అందులో తప్పు లేదు.కాబట్టి నోరు మూస్కో.

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా’ అని బెదిరించాడు.ధైర్యం చేసిన బాలిక చివరకు సవతి తల్లికి విషయం చెప్పింది.

అయితే ఆమె నమ్మలేదు.

కానీ, భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ మహిళ నిఘా వేసింది.శుక్రవారం సాయంత్రం పనిలోంచి తొందరగా ఇంటికి వచ్చింది.ఆ సమయంలో భర్త బాలికను వేధిస్తూ కనిపించాడు.

ఆలస్యం చేయకుండా మానేసర్‌ మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది.ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

‘నిందితుడిని గంటన్నర సేపు ప్రశ్నించాం.నేరం ఒప్పుకున్నాడు.

అయితే ఆశ్చర్యకరంగా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు’ అని స్టేషన్‌ అధికారి పూనమ్‌ సింగ్‌ తెలిపారు.పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శనివారం అతన్ని పటౌడీ కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం జ్యూడీషియల్‌ కస్టడీ విధించారు.

మరోవైపు ఆ మృగాన్ని ఉరి తీయాలంటూ శనివారం కోర్టు బయట పలు సంఘాలు ధర్నా చేపట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube