వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టోనర్ ను వాడితే మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair growth ) అనేది సరిగ్గా ఉండదు.ఆడవారే కాదు మగవారు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు.

 Using This Natural Toner Once A Week Will Make Your Hair Grow Twice As Fast! Nat-TeluguStop.com

హెయిర్ గ్రోత్ ను ఎలా పెంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టోనర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వారానికి ఒక్కసారి ఈ టోనర్ ను వాడితే వద్దన్నా కూడా మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది.

Telugu Care, Care Tips, Healthy, Homemade, Long, Natural, Thick-Telugu Health

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు రెబ్బలు కరివేపాకు( curry leaves ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు టీ పొడి, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు, అంగుళం దాల్చిన చెక్క వేసుకుని ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్‌ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Homemade, Long, Natural, Thick-Telugu Health

గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ అనేది రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే మీ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.

కురులు మూలాల నుంచి స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు త‌గ్గుముఖం పడతాయి.కొద్ది రోజుల్లోనే మీ హెయిర్ డబుల్ అవుతుంది.పొడుగ్గా మారుతుంది.

కాబట్టి హెయిర్ గ్రోత్ లేదని సతమతం అవుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధంగా టోనర్ ను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube