వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఆరాటపడుతున్న వారికి ఉత్తమ ఇంటి చిట్కా ఇది!

త‌మ ముఖ చర్మం వైట్ గా మరియు గ్లోయింగ్ గా కనిపించాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల ప్రోడక్ట్స్ ను వాడుతుంటారు.

 This Is The Best Home Remedy For Those Who Want White And Glowing Skin! Glowing-TeluguStop.com

వాటికోసం ప్రతినెలా వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులతో సంబంధం లేకుండా మన ఇంట్లో దొరికే పదార్థాలతో చాలా సులభంగా తెల్లటి మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, White Skin-Telugu

ముందుగా ఒక బంగాళదుంప( Potato )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ బంగాళదుంప ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో బంగాళదుంప జ్యూస్ ను వేసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి మరియు ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని చాలా లూస్ స్ట్రక్చర్ లో మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

ఐస్ క్యూబ్స్ గా మారిన తర్వాత వాటిని ఉపయోగించాలి.అందుకోసం ముందుగా ముఖంపై ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న ఐస్ క్యూబ్ ను తీసుకుని ముఖానికి మరియు మెడకు సున్నితంగా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, White Skin-Telugu

ఈ విధంగా రెండు రోజులకు ఒకసారి చేస్తే మీ స్కిన్ లో చాలా మార్పులను గమనిస్తారు.ముఖ్యంగా ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని క్రమంగా తొలగిస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది.

చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.స్కిన్ హెల్తీగా మరియు బ్యూటిఫుల్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube