సినిమా ఇండస్ట్రీ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) లలో ఆహుతి ప్రసాద్ ( Ahuti Prasad )ఒకరు ఈయన ఆహుతి అనే సినిమా తో మంచి పేరు తెచ్చుకోవడంతో ఈయన పేరు కి ముందు ఆహుతి అనే పేరు పెట్టడం జరిగింది.ఈయన చాలా తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
మొదట ఈయన విలన్ గా నటించాడు.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్ లలో నటించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఈయన చేసిన సినిమాల్లో ఈయన కి బాగా పేరు తెచ్చిన సినిమాలు అంటే నిన్నే పెళ్లాడుతా, చందమామ, ఖడ్గం అనే చెప్పాలి ఈ సినిమాలు ఈయన కెరియర్ లో చాలా మంచి సినిమాలు గా చెప్పవచ్చు…ఈయన చేసిన ప్రతి పాత్ర లో కూడా ఒదిగిపోయి నటించడం ఆయనకి ఉన్న ఒక మంచి అలవాటు అనే చెప్పాలి.ఇక బృందావనం సినిమాలో ఈయన చేసిన పాత్ర కి మంచి పేరు వచ్చింది.
ఎమోషనల్ సీన్స్ చేయడం లో ఈయన మంచి ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి.
అయితే ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈయన చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ లు పోషినప్పటికీ ఈయనకి సరైన గుర్తింపు అయితే రాలేదు అనే చెప్పాలి.ఇప్పుడు చేస్తున్న నటులు ఒకటి రెండు సినిమాలకే చాలా పాపులర్ అవుతుంటే ఆయన దాదాపు గా 200 లకు పైన సినిమాల్లో నటించారు అయినా కూడా ఆయన కి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు అనేది వాస్తవం…షాయాజీ షిండే, సోను సూద్ లాంటి పర భాష ఆరిస్టులకి ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది కానీ మన తెలుగు నటుడు ఏ క్యారెక్టర్ అయినా అలవోక గా చేసే ఆహుతి ప్రసాద్ లాంటి వాళ్ళని ఇక్కడ గుర్తించరు…ఇక 2015 వ సంవత్సరంలో ఆయన హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ల చనిపోవడం జరిగింది.