ఇవి రెండు పాటిస్తే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.. తెలుసా?

అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.ముఖంపై ఒక మొటిమ వ‌చ్చిందంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.

 If You Follow These Two Tips, You Can Stay Away From Acne! Acne, Acne Removal Ti-TeluguStop.com

ముఖ్యంగా మగువలు మొటిమల( acne ) వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.మొటిమలు అందాన్ని పాడుచేస్తాయి.

అందుకే వాటిని వదిలించుకోవడం కోసం ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలు పాటిస్తే మొటిమలు పోవడమే కాదు మళ్ళీ మళ్ళీ మీ దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.

మ‌రి ఇంతకీ ఆ రెండు చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిఫల పౌడర్.

ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే చర్మ సౌందర్యానికి కూడా త్రిఫల పౌడర్ ఉపయోగపడుతుంది.

అందుకోసం ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్( Triphala powder ), ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

ప్రతిరోజు ఉదయాన్నే ఈ త్రిఫల వాటర్ ను తాగాలి.

అలాగే మరొక చిట్కా ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడిని( Sandalwood powder ) వేసుకోవాలి.అలాగే చిటికెడు పసుపు మరియు సరిపడా కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతల అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు వదిలేయాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఇలా చేయాలి.

అంతే ఈ రెండు చిట్కాలు పాటిస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.అలాగే మొటిమలు మళ్లీమళ్లీ వేధించకుండా ఉంటాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మొటిమల్లేని చర్మాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ రెండు చిట్కాలు పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube