Eyesight super drink : కంటి చూపుతో పాటు ఇమ్యూనిటీని రెట్టింపు చేసే సూప‌ర్ డ్రింక్ ఇది!

వయసు పైబ‌డే కొద్ది కంటి చూపు తగ్గడం అనేది సర్వసాధారణం.కానీ, ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లో సైతం కంటి చూపు మందగిస్తుంది.

 This Is A Super Drink That Doubles Immunity Along With Eyesight! Super Drink, Ey-TeluguStop.com

దాంతో కళ్లద్దాల‌పై ఆధారపడుతున్నారు.అయితే కంటి చూపును కొన్ని కొన్ని ఆహారాలు సహజంగానే మెరుగుపరుస్తాయి.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్ కూడా ఒకటి.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు రెట్టింపు అవడమే కాదు ఇమ్యూనిటీ సిస్టం సైతం బలంగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గ్రీన్ యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి వాట‌ర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇక చిన్న సైజు బీట్ రూట్ ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్లో కడిగి ముక్క‌లుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక గ్లాస్‌ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుంటే సరిపోతుంది.

Telugu Tips, Immunity System, Latest-Telugu Health Tips

ఈ జ్యూస్ లో కొద్దిగా తేనెను మిక్స్ చేసి డైరెక్ట్ గా తీసుకోవడమే.ఈ జ్యూస్ రుచి గా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను సైతం కలిగి ఉంటుంది.ప్రతిరోజు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.మరియు ఇతర కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్న దూరం అవుతాయి.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.దీంతో వివిధ రోగాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube