Brazil President Elections: లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కాదు ..లెఫ్ట్ లెఫ్ట్ అంటున్న లాటిన్ అమెరికా

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామ పక్షాల అభ్యర్థి లూలా, ప్రస్తుత అధ్యక్షుడు బొల్సేనారా ను ఓడించారు.అయితే ఆ దేశం లో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు ఓడిపోవడం 34 ఏళ్ల తర్వాత ఇదేనట.

 Brazil Leftist Lula Wins In Presidential Elections Details, Brazil President Ele-TeluguStop.com

అయితే బ్రెజిల్ లో వామపక్షాల విజయంతో ‘ పింక్ టైడ్’ అని పిలవబడుతున్న వామపక్షాల ఆధిక్యత మరింతగా పెరిగింది.తొలుత మెక్సికో, ఆ తర్వాత అర్జెంటీనా, వరుసగా చిలీ, కొలంబియా, పెరూ తదితర దేశాల్లో లెఫ్ట్ ప్రభుత్వాలు ఏర్పడుతూ వస్తున్నాయి.

కొలంబియా లో అయితే చరిత్ర లో మొదటిసారిగా లెఫ్ట్ ప్రభుత్వం ఏర్పడడం.ఇప్పుడు ప్రపంచంలో 8వ ఆర్ధిక శక్తి అయిన బ్రెజిల్ లో లూలా పగ్గాలు చేపడుతున్నారు.

ఆ దేశంలో కరోనా మహమ్మరి సమయంలో అధిక స్థాయిలో మరణాలు నమోదయ్యాయి.6 లక్షల మంది పైగా మరణాలతో అమెరికా తర్వాత ద్వితీయ స్థానం లో ఉంది.కరోనా కట్టడిలో వైఫల్యంతో బాటు అమెజాన్ అడవుల ధ్వంసం ఎక్కువకావడం, ఆర్ధిక సంక్షోభం కారణాలతో అక్కడి ప్రజలు ప్రస్తుత అధ్యక్షుడి పాలన పై వ్యతిరేకంగా ఉన్నారు.వామ పక్షాల అభ్యర్థి లూలా నాయకత్వంలో ప్రజా సంక్షేమం సాధ్యమౌతుందని భావించారు.

గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రజాసంక్షేమ పథకాలకు అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పెద్దపీట వేశారు.

Telugu Bolsenaro, Brazilleftist, Brazil, Brazil Lula, India Brazil, Latin Americ

రెండుసార్లు అధ్యక్షుడిగా వుండి,మూడోసారి రాజ్యాంగ నిబంధనల వల్ల(రెండుసార్లకు మించి మూడోసారి పదవి చేపట్టడం నిషేధం) పదవి వదులుకునే వేళ కూడా ఆయన పట్ల ప్రజాభిమానం తారాస్థాయిలోనే ఉంది.భారత్ పట్ల అభిమానం, సానుకూల దృక్పధం కలిగి ఉన్న ఆయన అధ్యక్షజరిగిన సమావేశంలో తన ఇరుదేశాల నడుమ వాణిజ్య,దౌత్య బంధాలు గట్టిపడగలవని ఆశిద్దాం.ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం ముసురుకుంటున్న వేళ ప్రపంచ దేశాల్లో ప్రజల పట్ల బాధ్యతగల నాయకత్వాలు అధికారంలోవుంటే ఆయా దేశాలతో బాటు మిగిలిన దేశాలకూ మేలు కలుగుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube