సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా బ్యాంకుల్లో జరుగుతున్న అవినీతి మరియు వైట్ కాలర్ మోసాలకు సంబంధించిన విషయాలను చర్చించబోతున్నారు.
మహేష్ బాబు ఈ సినిమా లో గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ పోస్టర్ మరియు ప్రీ మోషన్ పోస్టర్ లు చెబుతున్నాయి.కాస్త ఎక్కువ జుట్టు మరియు గడ్డంతో కనిపించే మహేష్ బాబును ప్రేక్షకులు ఖచ్చితంగా విభిన్నంగా చూస్తారు.
అన్నట్లుగానే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ మొదలయ్యినప్పటి నుండి కూడా సినిమాకు సంబంధించి అనేక పుకార్ల షికార్లు చేశాయి.
తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది.
ఈ సినిమా లో మహేష్ బాబు పాత్ర పేరు సర్కార్ గా టాక్ వినిపిస్తుంది.
సర్కార్ అనే పేరుతో మహేష్ బాబు చేసే పనులు సినిమాలో చాలా కీలకంగా కనిపిస్తాయంటూ టాక్ వినిపిస్తుంది.మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
ఇక రెండవ షెడ్యూల్ కు ఏర్పాట్లు చేసిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది.సినిమా చిత్రీకరణ నిలిచి పోయినా కూడా అభిమానుల కోసం మే 31న ప్రత్యేకమైన పోస్టర్ ను ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు చేసిన సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో మహేష్ బాబు ఈ సినిమాలో సర్కార్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
మహేష్ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ వేసి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.