ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.ఛాలెంజ్ లు విసరడం కాదన్న ఆయన దమ్ముంటే రాజీనామా చేయాలని తెలిపారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.కేవలం ఆత్మహత్యలే ఉంటాయని తెలిపారు.
ఖమ్మంలో రాజకీయాలు పార్టీల చుట్టూ ఉంటాయని, వ్యక్తుల చుట్టూ కాదని స్పష్టం చేశారు.అంతేకానీ వ్యక్తుల మీద పార్టీలు ఆధారపడవని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు.ఎవరైనా పార్టీ పద్ధతిలో నడవాల్సిందేనని వెల్లడించారు.
కేసీఆర్ కు సవాల్ విసరొద్దని.మంచిది కాదని హెచ్చరించారు.
కేసీఆర్ కు ద్రోహం తలపెట్టే వాళ్లు పార్టీని విడిచి వెళ్లిపోవాలని సూచించారు.