దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోన మహమ్మారి( Corona Virus ) గురించి జనాలు ఎప్పటికీ మరిచిపోరు.ఎందుకంటే అది అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి.
ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని జనాభా 10 శాతం మంది పిట్టల్లా రాలిపోయారు.ఈ క్రమంలో రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
మరీ ముఖ్యంగా ఫస్ట్ టెర్మె కరోన విజృంభనతో ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతికారు.ఇక ఇప్పుడిప్పుడే అంతా కోలుకుంటున్న సమయంలో HMPV అనే మరో వైరస్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది.
అవును, చైనాలో( China ) అధికంగా ఉన్న ఈ వైరస్.ఇప్పుడిప్పుడే భారత దేశానికి వలస వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు భారత దేశంలో( India ) పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదు అయినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో భారత ప్రజలు చాలా భయాందోళనలకు గురవుతున్నారు.అదే సమయంలో దేశంలో మరో కొత్త వైరస్ ఇపుడు తీవ్ర కలకలం రేపుతోంది.మీరు విన్నది నిజమే.భారత దేశంలో మరో మహమ్మారి ప్రజలను వణికిస్తోంది.ఎవరికీ తెలియని ఆ రోగంతో ప్రజలు తమకు ఏమైందో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఇది మన రాష్ట్రంలో కాదండోయ్… మహారాష్ట్రలో( Maharashtra ) ఆ సరికొత్త రోగం వలన చాలామంది అల్లాడిపోతున్నట్టు తెలుస్తోంది.
తత్ఫలితంగా తలపై ఉన్న జుట్టంతా కేవలం మూడంటే 3 రోజుల్లో జుట్టు ఊడిపోతుంది( Hairloss ) అని అంటున్నారు.దీంతో అక్కడి ప్రజలు జుట్టులేని జీవితం ఉహించుకోలేక డిప్రెషన్లో పడినట్టు వార్తలు వస్తున్నాయి.మహారాష్ట్రలోని షెగావ్‌లోని బుల్దానాలో( Buldhana ) ఇది వ్యాపించినట్టు తెలుస్తోంది.
షేగావ్‌లోని కలవాడ్, బోండ్‌గావ్, హింగానా గ్రామాల్లోని ప్రజలు గుర్తు తెలియని ఈ వైరస్‌తో( Virus ) నానా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ వైరస్ కారణంగా పురుషులు, స్త్రీలు తమ జుట్టును కోల్పోతున్నారు.
ఈ వైరస్ సోకి తర్వాత మొదటి రోజు తల దురద పుడుతుంది.రెండవ రోజు వెంట్రుకలు రాలిపోవడం మొదలెడుతుంది.
ఇక మూడవ రోజుకి జుట్టంతా రాలిపోయి.మనుషులు చాలా విచిత్రంగా తయారవుతున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా అక్కడి అధికారులు వారిని పట్టించుకోకపోవడంతో ప్రజలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు.దీనిపై షెగావ్‌లోని శివసేన చీఫ్ రామేశ్వర్ థార్కర్ జిల్లా ఆరోగ్య ఆఫీసర్‌కి ఒక స్టేట్‌మెంట్ అందించారు.