ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

ఇమాన్వి ఇస్మాయిల్.( Imanvi Esmail ) ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

 Demand For Imanvi Esmail Details, Imanvi Esmail, Tollywood, Prabhas, Bollywood,-TeluguStop.com

ప్రభాస్( Prabhas ) సరసన హీరోయిన్గా ఎప్పుడూ అయితే ఎంపిక అయిందో ఆ క్షణం నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతూనే ఉంది.హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామా మూవీలో ప్రభాస్ నా హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారు.

పూజా కార్యక్రమాల సమయంలో తీసిన ఫోటోలు ఫైనల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ ఎవరా అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు అభిమానులు.ఈ ఒక్క ఫోటోతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ డిమాండ్ రెండు పెరిగిపోయాయి.

Telugu Anurag Basu, Bollywood, Fauji, Imanvi Esmail, Imanviesmail, Kartik Aaryan

డార్లింగ్ జోడిగా ఈ అమ్మడుకి డెబ్యూనే ఇంత పెద్ద బ్రేక్ దక్కడం పట్ల ఆల్రెడీ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా తన మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది.నిజమో కాదో కానీ ఫౌజీ అయ్యే దాకా వేరే సినిమాలు ఒప్పుకోకూడదని మైత్రి సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు టి సిరీస్( T-Series ) అధినేతలు సంస్థ ఇమాన్వి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.

కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan ) హీరోగా అనురాగ్ బసు( Anurag Basu ) డైరెక్షన్ లో ఒక భారీ రొమాంటిక్ మూవీని ప్లాన్ చేశారు నిర్మాత భూషణ్ కుమార్.( Producer Bhushan Kumar ) ఫౌజికి సైతం ఈయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

సందీప్ వంగా,ప్రభాస్ స్పిరిట్ కి మెయిన్ ప్రొడ్యూసర్ కూడా.ఆదిపురుష్ కి ఎంత బడ్జెట్ పెట్టారో చూశాము.

Telugu Anurag Basu, Bollywood, Fauji, Imanvi Esmail, Imanviesmail, Kartik Aaryan

ఈ బాండింగ్ ని వాడుకుని ఇమాన్వి రెండో సినిమాని తమకు లాక్ చేయించేలా మాట్లాడుతున్నట్టు ముంబై రిపోర్ట్.ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్న అనురాగ్ బసు సినిమాకు హీరోయిన్ ఎంపికే పెద్ద టాస్క్ అయ్యిందని సమాచారం.ఇక సోషల్ మీడియాలో తన రీల్స్, డాన్స్ చూసినవాళ్లకు పెర్ఫార్మన్స్ గురించి డౌట్లు లేవు కానీ ఫౌజీ( Fauji ) లాంటి ప్యాన్ ఇండియా మూవీలో ఎలా కనిపిస్తుందనేది ఆసక్తికరం.పారితోషికం కూడా భారీగానే ముట్టజెబుతున్నారట.

రష్మిక మందన్న, శ్రీలీల ఇలా రెండు మూడు ఆప్షన్లతోనే నెట్టుకొస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు భవిష్యత్తులో ఇమాన్వి ఇస్మాయిల్ మరో ఛాయస్ అవుతుందేమో చూడాలి మరి.ఫౌజీ విడుదల 2026కి ప్లాన్ చేస్తున్నారట.సినిమాలో ఇంకా నటించక ముందే ఆ సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఇలా వరుసగా అవకాశాలు వస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube