Dry Hair : జుట్టు విపరీతంగా డ్రై అయిపోయిందా.. ఒక్క వాష్ లో స్మూత్ అండ్ సిల్కీగా మార్చుకోండిలా!

సాధారణంగా ఒక్కోసారి జుట్టు విపరీతంగా డ్రై( Dry Hair ) అయిపోతూ ఉంటుంది.రెగ్యులర్ గా తల స్నానం చేయడం, పోషకాహార లోపం, వాతావరణం లో మార్పులు, పొడి గాలి, మద్యపానం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల జుట్టు పొడి పొడిగా మారుతుంటుంది.

 Follow This Remedy To Make Dry Hair Smooth And Silky-TeluguStop.com

దీంతో చాలా మంది డ్రైగా మారిన జుట్టును ప్రిపేర్ చేసుకునేందుకు సెలూన్ కు పరుగులు పెడుతుంటారు.కానీ ఇంట్లో కూడా డ్రై హెయిర్ ను రిపేర్‌ చేసుకోవచ్చు.

కేవ‌లం ఒక్క వాష్ లోనే కురుల‌ను స్మూత్ అండ్ సిల్కీగా( Smooth and Silky Hair ) మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Dry, Remedydry, Care, Care Tips, Healthy, Remedy, Latest, Papaya Egg, Sil

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు( Papaya ) వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత బొప్పాయి పండు ప్యూరీలో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు ఆవ ఆయిల్ వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా పాపాయ ఎగ్ హెయిర్ మాస్క్( Papaya Egg Hair Mask ) సిద్ధం అవుతుంది.ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dry, Remedydry, Care, Care Tips, Healthy, Remedy, Latest, Papaya Egg, Sil

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.బొప్పాయి, గుడ్డు, పెరుగు మరియు ఆవ నూనె ఇవన్నీ జుట్టుకు మంచి తేమను అందిస్తాయి.పొడి మరియు దెబ్బతిన్న జుట్టును సమర్థవంతంగా రిపేర్ చేస్తాయి.కురులను స్మూత్ అండ్ సిల్కీగా మారుస్తాయి.పైగా ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ ఫాల్ సమస్య( Hairfall ) దూరం అవుతుంది.

జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube