కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు గుర్తించాలి..: హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) మండిపడిన ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

 Congress Government Should Recognize The Facts Harish Rao Details, Harish Rao, H-TeluguStop.com

కొత్తగా నియామకమైన నర్సింగ్ ఆఫీసర్లకు( Nursing Officers ) కాంగ్రెస్ సర్కార్ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని హరీశ్ రావు ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్ మెంట్ ఘనతను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందన్నారు.

కానీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.

వారి జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.దీని కారణంగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమాకం అయిన నాలుగు వేల మంది నర్సింగ్ అధికారులు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని గొప్పులు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube