సాధారణంగా కొందరికి జుట్టు ఊడిపోతుంది.కానీ కొత్త జుట్టు అనేది రాదు.
హెయిర్ గ్రోత్( Hair Growth ) లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.హెయిర్ గ్రోత్ లేకపోవడం వల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతుంది.
పల్చటి జుట్టుతో( Thin Hair ) ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నా సెట్ అవ్వదు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం రకరకాల ఆయిల్స్, సీరమ్స్ వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( Fenugreek ) మరియు మూడు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్మేరీ ఆకులు వేసుకుని చిన్న మంటపై దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో ఆయిల్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కి అప్లై చేసుకుని పది నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి.లేదా నైట్ ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు.ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.
పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.
హెయిర్ రూట్స్ సైతం స్ట్రాంగ్ గా మారతాయి.