గత ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi ) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.రైసీ మరణం ప్రపంచానికే షాక్ గురి చేయడం జరిగింది.
దీంతో ఇరాన్ లో జూన్ 28న నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది.ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు దేశంలోనే ముగ్గురు అగ్రశ్రేణి అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
దీంతో నూతన అధ్యక్షుడు ఎన్నికకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు జూన్ 28న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్థానిక మీడియా స్పష్టం చేసింది.
రైసీ మరణంపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి.ఇరాన్ ప్రభుత్వం మాత్రం వాతావరణం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ధ్రువీకరించడం జరిగింది.ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పై అమెరికా ( America )సంతాపం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో “రైసీ చేతులు రక్తంతో తడిసాయి” అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అనేక పోరాటాలను ఆయన అణిచివేసినట్లు పరోక్షంగా ఇరాన్( Iran ) లో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల వెనక రైసీ ఉన్నట్లు పేర్కొంది.
హమాస్ సహా అనేక తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలిచారు.సాధారణంగా ఎవరు మరణించిన మేం విచారం వ్యక్తం చేస్తాం.అలాగే ఆయన మృతి పట్ల కూడా సంతాపం తెలియజేస్తున్నామని జాఅగరాజ్యతీయ భద్రతా మండలి అధికారి ప్రతినిధి జాన్ కీర్బీ( John Kirby ) పేర్కొన్నారు.