కమల్ హాసన్( Kamal Haasan ) సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంత స్థాయికి వెళ్ళాడో మనం అందరం చూసాం.విశ్వ నాయకుడిగా ఎవరు చేయలేని అద్భుతాలు కమల్ సొంతం.
నటనలోనూ డాన్స్ లోనూ చెరగని ముద్రను వేసుకున్న కమల్ హాసన్ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ ఎన్నో రికార్డులను తల ఖాతాలో వేసుకున్నాడు.సౌత్ ఇండియా మాత్రమే కాదు నేషనల్ లెవల్ లో తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ కెరియర్ పరంగా ఎన్ని ఏళ్ల గ్యాప్ వచ్చినా తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు.దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత విక్రమ్( Vikram Movie ) లాంటి ఒక విజయం దక్కితే అభిమానుల ఆనందానికి హద్దే లేదు.
అయితే ఇన్ని రికార్డులను సాధించిన కమల్ హాసన్ కెరియర్ లో హీరోగా నలదొక్కుకున్నాక తన పక్కన ఒక నటి హీరోయిన్ గా నటించాలని కోరికతో దాదాపు ఆమె డేట్స్ కోసం ఐదు నెలల పాటు ఎదురు చూశాడట.ఆ హీరోయిన్ మరెవరో కాదు.కమెడియన్ గా( Comedian ) సౌత్ ఇండియాలోనే తిరుగులేని నటిగా ఎదిగిన కోవై సరళ.( Kovai Sarala ) అదేంటి ఇలాంటి ఒక చిన్న నటి కోసం లేదా కమీడియన్ గా ఉన్న కోవై సరళ కోసం కమల్ హాసన్ ఎదురుచూడడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.మరి అసలు విషయం ఇక్కడే ఉంది.మనకు తెలిసి కమెడియన్ గానే కోవై సరళ తెలుసు కానీ ఆమె కెరియర్ తొలినాలలో కొన్ని చిత్రాలు హీరోయిన్గా చేసింది ఆమె కామెడీ టైమింగ్ కానీ నటన కానీ అద్భుతం అని అప్పట్లో కమల్ హాసన్ ఎంతగానో పొగిడేవారట.
ఆయన నటించిన లీలావతి సినిమాలో( Leelavathi Movie ) భార్య పాత్ర కోసం కమల్ హాసన్ కోవై సరళ కావాలని అడిగారంట.కానీ ఆమె అప్పట్లో ఓటు తెలుగులో బాగా బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.అయినా కూడా వచ్చే వరకు ఎదురు చూద్దాము అని ఆమె తప్ప ఆ పాత్రలు ఎవరు న్యాయం చేయలేదని ఐదు నెలల పాటు ఎదురు చూశారట.సినిమా అయిపోయిన తర్వాత కూడా మీరు తప్ప ఆ పాత్రకు ఎవ్వరు న్యాయం చేయలేరు.
అంత బాగా చేశారు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారట.అలా ఒక ఆర్టిస్ట్ కోసం అంత సమయం ఇవ్వడం కమల్ లాంటి హీరో చేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.