రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,పంట రుణాలు రెండు లక్షలు మాపీ చేయాలని,రైతుకు 500 బోనాస్ ప్రకటించాలని, రైతుకు, కౌలు రైతుకు రైతు భరోసా 15 వేల రూపాయలు అందజేయాలని బోయినిపల్లి తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహ చారి, మండల ప్రధాన కార్యదర్శి ఎడపల్లి పరశురాములు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అమిరిశెట్టి గంగయ్య, బిజెపి నాయకులు గంగిపల్లి స్వామి కుమార్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజూరి కిరణ్, భూత్ అధ్యక్షులు, బోగోజి గంగాధర్ చారి, తడక రామానుజం, కూస శ్రీనివాస్ మంద రవి, తదితరులు ఉన్నారు.