తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్ మోసం.. రూ.50 వేలు డిమాండ్

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.దీంతో సైబర్ నేరాల( Cyber Crimes ) సంఖ్య భారీగా పెరిగిపోతుంది.

 Cyber ​​fraud In The Name Of Telangana Dgp Rs 50 Thousand Demanded Details,-TeluguStop.com

ఏదో రకంగా ప్రజలను బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా( Telangana DGP Ravigupta ) పేరుతో కేటుగాళ్లు మోసానికి తెర తీశారు.

తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్ కు పాల్పడ్డారు.ఈ నేపథ్యంలోనే ఓ వ్యాపారవేత్తకు అగంతకుడు కాల్ చేశఆడు.వ్యాపారవేత్త కూతురు కాల్ అటెండ్ చేయగా.డ్రగ్స్ కేసులో( Drugs Case ) అరెస్ట్ చేస్తున్నామని బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.దీంతో వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.డీజీపీ డీపీతో వచ్చిన ఈ కాల్ +92 కోడ్ తో ఉందని తెలుస్తోంది.ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు.సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube