ముఖం అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.బ్యూటీ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు, పేష్ ప్యాకులు ఇలా మార్కెట్‌లో దొరికే ప్రోడెక్ట్స్‌ను వేలకు వేలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు.
తీరా అవి వాడాక.ఎలాంటి ఫలతం రాకపోతే ఎంతో బాధపడుతుంటారు.
అయితే రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఆ రోజ్ వాటర్‌లో.
ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి రాస్తే.మిలమిలా మెరిసే చర్మం మీసొంతం చేసుకోవచ్చు.
అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.రోజ్ వాటర్ తీసుకుని.
అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మొండి మచ్చలు తగ్గుముఖం పడతాయి.

రోజ్ వాటర్‌లో కొద్దిగా శెనగపిండి మరియు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అరగంట తర్వాత నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముడతలు పోయి.ముఖం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు కూడా తొలగుతాయి.
రోజ్ వాటర్‌లో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి.
ముఖానికి, మెడకు అప్లై చేయాలి.ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
మరియు సన్ బర్న్ నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.