ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరో మాట..: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని కేటీఆర్ దుయ్యబట్టారు.

 One Word On Votes Another Word On Votes Ktr Details, Another Word On Vote, Ex Mi-TeluguStop.com

అధికారంలోకి రాకముందు ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టి ప్రభుత్వం రాగానే చేతులేత్తేస్తారా అని నిలదీశారు.

కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదన్న కేటీఆర్ రైతు వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు.

ఓట్ల నాడు ఒక మాట.నాట్ల నాడు మరో మాట చెప్పడంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు.తమ గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు( Farmers ) వదిలిపెట్టరని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ షురూ అయిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube