ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరో మాట..: కేటీఆర్
TeluguStop.com
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.
ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని కేటీఆర్ దుయ్యబట్టారు.అధికారంలోకి రాకముందు ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టి ప్రభుత్వం రాగానే చేతులేత్తేస్తారా అని నిలదీశారు.
కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదన్న కేటీఆర్ రైతు వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు.
ఓట్ల నాడు ఒక మాట.నాట్ల నాడు మరో మాట చెప్పడంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు.
తమ గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు( Farmers ) వదిలిపెట్టరని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ షురూ అయిందని తెలిపారు.
Wpt Global: Ein Klarer Guide Zu Kundensupport, Sicherheit Und Praxis Für Deutsche Spieler