పల్నాడు హింస : వైసీపీ ఎమ్మెల్యే 'పిన్నెల్లి ' అందుకే పారిపోయారు

పల్నాడు( Palnadu )లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన సృష్టించాయి .ఇప్పటికే దీనిపై సిట్ ను ఏర్పాటు చేయడంతో పాటు , ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

 Palnadu Violence: Ycp Mla 'pinnelli' Ran Away , Macharla, Pinnelli Ramakrishnare-TeluguStop.com

ఈ హింసాత్మక ఘటనలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) పేరు ప్రముఖంగా వినిపించింది .దీనికి తగ్గట్లుగానే ఈ వ్యవహారం తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన పరారీలో ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది .తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు,  జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు.  గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన వారు ఈ సంఘటనపై అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.” పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసాం.ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసాం.

ఈసీ కేవలం సమశ్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది.

Telugu Ap, Jagan, Macharla-Politics

  ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారు.ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు.ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఆయన తప్పించుకుని హైదరాబాద్ ( Hyderabad)పారిపోయారు.అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి పై చర్యలు లేవు.

ఆయనపై పోలీసులు ఎప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు .పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు హైదరాబాదుకు పారిపోయారు.?  ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలి . ఎస్సీ,  ఎస్టీ బీసీలపై మాచర్లలో దాడులు చేశారు.ప్రభుత్వం ఇచ్చిన భూములను పిన్నెల్లి కబ్జా చేశారు.  మాచర్ల నియోజకవర్గం లో వైసీపీ మూకలు దాడులు చేశాయి.ఈ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ , బీసీలు గాయపడ్డారు.దాడి చేసి పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడతారా,  అధికారుల జాబితా పంపింది , నియమించింది మీ ప్రభుత్వమే కదా  అంటూ ప్రశ్నించారు.

Telugu Ap, Jagan, Macharla-Politics

 ‘ప్రజలు భారీగా తరలివచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.85 శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని వైసిపి తట్టుకోలేకపోతోంది.ఆ పార్టీ దాడుల్లో గాయపడిన వారికి నేరచరిత్ర లేదు.  టిడిపి తరఫున ఏజెంట్లుగా కూర్చోవడమే వారు చేసిన తప్పు అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube