పల్నాడు హింస : వైసీపీ ఎమ్మెల్యే ‘పిన్నెల్లి ‘ అందుకే పారిపోయారు

పల్నాడు( Palnadu )లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన సృష్టించాయి .

ఇప్పటికే దీనిపై సిట్ ను ఏర్పాటు చేయడంతో పాటు , ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఈ హింసాత్మక ఘటనలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) పేరు ప్రముఖంగా వినిపించింది .

దీనికి తగ్గట్లుగానే ఈ వ్యవహారం తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన పరారీలో ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది .

తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు,  జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు.

  గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన వారు ఈ సంఘటనపై అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.

'' పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసాం.ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసాం.

ఈసీ కేవలం సమశ్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. """/" /   ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారు.

ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు.ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఆయన తప్పించుకుని హైదరాబాద్ ( Hyderabad)పారిపోయారు.అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి పై చర్యలు లేవు.

ఆయనపై పోలీసులు ఎప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు .పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు హైదరాబాదుకు పారిపోయారు.

?  ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలి .ఎస్సీ,  ఎస్టీ బీసీలపై మాచర్లలో దాడులు చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన భూములను పిన్నెల్లి కబ్జా చేశారు.  మాచర్ల నియోజకవర్గం లో వైసీపీ మూకలు దాడులు చేశాయి.

ఈ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ , బీసీలు గాయపడ్డారు.దాడి చేసి పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడతారా,  అధికారుల జాబితా పంపింది , నియమించింది మీ ప్రభుత్వమే కదా  అంటూ ప్రశ్నించారు.

"""/" /  'ప్రజలు భారీగా తరలివచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.85 శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని వైసిపి తట్టుకోలేకపోతోంది.

ఆ పార్టీ దాడుల్లో గాయపడిన వారికి నేరచరిత్ర లేదు.  టిడిపి తరఫున ఏజెంట్లుగా కూర్చోవడమే వారు చేసిన తప్పు అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొరపాటున రూ.1.5 కోట్లు శాలరీగా జమ చేసిన కంపెనీ.. అవి తీసుకుని ఉద్యోగి జంప్..??