వీడియో: స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్.. కట్ చేస్తే యువకుడు డెడ్?

ఈ రోజుల్లో చాలామంది యువకులు రిస్కీ స్టంట్స్‌( Risky Stunts ) చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.జాగ్రత్త అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తమకు ఏమవుతుందిలే అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

 Tragic Swimming Pool Stunt Claims Young Mans Life In Ratlam Video Viral Details,-TeluguStop.com

ఆ ధోరణితో చివరికి కన్నవారికి కడుపుకోత మిగులుచుతున్నారు.కొందరు స్టంట్స్‌ చేస్తూ తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, ( Madhya Pradesh ) రాట్లం సిటీలో ఇలాంటి మరొక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్‌లో( Dolphin Swimming Pool ) జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో 18 ఏళ్ల అనికేత్ తివారీ( Aniketh Tiwari ) మరణించాడు.

ఈ బాలుడిని ఆసుపత్రికి తరలించగా, ఆల్రెడీ మరణించాడని డాక్టర్లు సోమవారం నాడు ప్రకటించారు.

అసలు ఏం జరిగిందంటే ఒక యువకుడు స్విమ్మింగ్ పూల్ లో స్టంట్ చేశాడు.

ఆ సమయంలో ఈ యువకుడి బాడీ అనికేత్ తలకు బలంగా దెబ్బతగిలింది.దాంతో అనికేత్ స్పృహతప్పి ఈత కొలనులోకి పడిపోయాడు.ఈ ఘటన CCTV కెమెరాల్లో రికార్డైంది.ఘటనలో లైఫ్ గార్డ్( Life Guard ) నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది అతని వల్లే ఈ పిల్లోడి ప్రాణాలు పోయాయని చాలామంది ఫైర్ అవుతున్నారు.

స్విమ్మింగ్ పూల్ భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ఒక యువకుడి నిర్లక్ష్యం మరొక యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాదాన్ని సీసీటీవీ క్యాప్చర్ చేసింది.దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఒక యువకుడు పూల్‌లో స్టంట్ చేస్తున్న సమయంలో, అతడి మోకాలు అనికేత్ ముఖంపై బలంగా గుద్దుకుంది.దీంతో అనికేత్ స్పృహతప్పి స్విమ్మింగ్ పూల్ లోతుల్లోకి వెళ్లిపోయాడు.

అక్కడే అనేక మంది ఉన్నప్పటికీ, అతనిని రక్షించడానికి ఎవరూ వెంటనే చర్యలు తీసుకోలేదు.చివరికి, లైఫ్ గార్డ్స్‌ అక్కడికి చేరుకున్నప్పటికి, అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.

దీంతో దురదృష్టవశాత్తు అనికేత్ మునిగి మరణించాడు.

డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన తాజా విషాదంతో, ఇప్పటికే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.గతంలో హెచ్చరికలు ఉన్నా, ఈ ఈత కొలను యాజమాన్యం దానిని కొనసాగించడం గమనార్హం.ఈ ఘటన నేపథ్యంలో, పోలీసులు స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదానికి కారణమైన పరిస్థితులను పరిశీలిస్తున్నారు.అలాగే బాధ్యతగా వహించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube