గత కొద్ది రోజులుగా తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( MLA Kolikapudi Srinivasa Rao ) వ్యవహారం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే మారుతూ వస్తోంది. సొంత పార్టీ నాయకులను సైతం ఆయన వేధింపులకు గురిచేస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తరుచూ అవమానిస్తున్నారని, ఇలా అనేక ఫిర్యాదులు టిడిపి అధిష్టానానికి వెళ్లాయి.
రైతులు, మహిళలు, మీడియా ప్రతినిధులు ఇలా ఎవరినీ వదిలి పెట్టకుండా కొలికలపుడి శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపాయి.అంతిమంగా టిడిపికి( TDP ) నష్టం చేకూర్చే వ్యవహారంగా మారడంతో పాటు, అనేక ఫిర్యాదులు ఆయనపై టిడిపి అధిష్టానానికి వెళ్లడంతో, నష్ట నివారణ చర్యలకు దిగింది టిడిపి అధిష్టానం.
ఈ మేరకు ఆయన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని టిడిపి అధిష్టానం కోరింది .దీంతో నిన్ననే ఆయన పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు.
చంద్రబాబు( CM Chandrababu ) ఆదేశాలతో టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య , ఎంపీ కేసినేని చిన్ని తో పాటు , మరికొంతమంది నేతలను కొలికపుడు శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా తిరువూరులో( Tiruvuru ) చోటుచేసుకుంటున్న వివాదాల పైన శ్రీనివాసులు వివరణ ఇచ్చారు.అయితే ఈ వ్యవహారాల కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని పార్టీ నేతలు శ్రీనివాసరావుకు వివరించడం, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు చెప్పిన విషయాన్ని కొలికపూడి కి వివరించడంతో , ఆయన తన తప్పిదాలను సరి చేసుకుంటానని చెప్పారట.ఈ మేరకు గత కొద్ది రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న వివాదాలకు పులిస్టాప్ పెట్టేందుకు, నియోజకవర్గ కార్యకర్తలకు వివరణ ఇచ్చేందుకు ఈరోజు ( ఆదివారం) పార్టీ కార్యకర్తలు , నాయకులతో కలిసి సభ ఏర్పాటు చేస్తున్నట్లు అధిష్టానానికి కొలికపూడి తెలిపారు.
తన వల్ల తలెత్తిన ఇబ్బందులను తానే సరి చేసుకుంటానని, ఒక్క అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలకు అధిష్టానానికి విన్నవించడంతో దానికి అంగీకరించారట.ఈ మేరకు తిరువూరులో నేడు కార్యకర్తలతో కొలికపూడి భేటీ కాబోతున్నారు. దీంతో ఈ సభలో ఆయన ఏం చెప్తారు ? కార్యకర్తలతో దూరం పెరగడంతో పాటు, వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని ప్రస్తావించి ఇకపై తాను అందరి అభిష్టం మేరకు నడుచుకుంటానని చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇక కొలికపూడి వ్యవహార శైలి కారణంగా ఇబ్బంది పడినా, పార్టీ నాయకులు ఆయన చెప్పే మాటలను ఎంతవరకు స్వాగతిస్తారు ? ఎమ్మెల్యేకు పార్టీ అధిష్టానం ఒక్క ఛాన్స్ ఇచ్చినా, నియోజకవర్గ పార్టీ నాయకులు కొలిక పూడి విషయంలో సర్దుకుపోతా రా అనేది తేలాల్సి ఉంది.