యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie ) సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పయనిస్తుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా యాంకర్ సుమతో కలిసి ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Shiva ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి( Rajamouli ) ఫ్లాప్ సెంటిమెంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.రాజమౌళితో ఏ హీరో సినిమా తీసిన తదుపరి రెండు మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.అయితే ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారనే చెప్పాలి.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత దేవర సినిమాలో నటించారు.
ఈ సినిమాకు రాజమౌళి బాడ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమోనని అభిమానులు కంగారు పడినప్పటికీ ఆ సెంటిమెంటును ఎన్టీఆర్ బ్రేక్ చేశారు.ఈ సెంటిమెంట్ సృష్టించినది ఎన్టీఆర్ బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ అంటూ అభిమానులు సంతోషపడుతున్నారు.ఈ విషయం గురించి రాజమౌళి మాట్లాడుతూ.
జక్కన్న సినిమా హిట్ అందుకున్న తర్వాత ఎలాంటి సినిమాలు ఎంపిక చేయాలనే విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఆ తప్పును జక్కన్న మీదకు వేస్తున్నామని ఎన్టీఆర్ తెలిపారు.మనకు కరెక్ట్ గా సినిమాలను ఎంపిక చేసుకోవడం చేతకాక నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేసాం.
ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశామనే వార్త వింటుంటే కాస్త బాగుంది అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చలకు కారణం అయ్యాయి.