దేవర ఫస్ట్ సింగిల్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. అది మాత్రం మైనస్ అంటూ?

ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) సందర్భంగా దేవర సినిమా( Devara ) నుంచి ఫియర్ సాంగ్( Fear Song ) అనే టైటిల్ తో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మలయాళ భాషలలో ఈ సాంగ్ రిలీజ్ అయింది.

 Latest News About Devara Movie First Single Details, Devara, Devara Movie, Tolly-TeluguStop.com

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సాంగ్ కి ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించి ఆయనే పాట పాడారు.తెలుగులో ఈ సాంగ్ కి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ అందించారు.

దేవర ముంగిట నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే దేవర నుంచి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలా వన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి.అనిరుద్ తన బీజీఎం తో తన స్వరంతో వణుకు పుట్టిస్తున్నారు.

Telugu Devara, Devara Fear, Ntr Devara, Tollywood-Movie

మొత్తానికి అనిరుద్( Anirudh ) బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బీట్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అనిరుద్ ఇంటెక్స్ వాయిస్ తో ఫియర్ సాంగ్ మోత దద్దరిల్లింది.అయితే ఈ సాంగ్ లో ఒక చిన్న మైనస్ ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్.అదేమిటంటే అనిరుద్ అందించిన బీట్ రామజోగయ్య శాస్త్రి( Ramajogayya Sastry ) లిరిక్స్ ని డామినేట్ చేస్తుంది.సాధారణంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ చాలా బాగుంటాయి కానీ అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వలన ఆ లిరిక్స్ పెద్దగా వినిపించడం లేదు.

Telugu Devara, Devara Fear, Ntr Devara, Tollywood-Movie

నేటి రోజుల్లో అదే ట్రెండ్ అనుకునే వారికి ఏమీ పర్వాలేదు కానీ లిరిక్స్ కూడా వినాలి అనుకునే వారికి ఈ విషయం కొంత నిరాశను కలిగించిందనే చెప్పవచ్చు.అయితే అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ ఇష్టపడే యూత్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టపడే ఫ్యాన్స్ ఈ విషయం పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్లు లేదు అందుకే సాంగ్ ని సూపర్ హిట్ చేశారు.రజనీకాంత్ జైలర్ హుకుం సాంగ్ పేరు మీద ఉన్న రికార్డు ఈ సాంగ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube