దేవర ఫస్ట్ సింగిల్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. అది మాత్రం మైనస్ అంటూ?

ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) సందర్భంగా దేవర సినిమా( Devara ) నుంచి ఫియర్ సాంగ్( Fear Song ) అనే టైటిల్ తో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మలయాళ భాషలలో ఈ సాంగ్ రిలీజ్ అయింది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సాంగ్ కి ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించి ఆయనే పాట పాడారు.

తెలుగులో ఈ సాంగ్ కి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ అందించారు.

దేవర ముంగిట నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే దేవర నుంచి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలా వన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి.

అనిరుద్ తన బీజీఎం తో తన స్వరంతో వణుకు పుట్టిస్తున్నారు. """/" / మొత్తానికి అనిరుద్( Anirudh ) బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బీట్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అనిరుద్ ఇంటెక్స్ వాయిస్ తో ఫియర్ సాంగ్ మోత దద్దరిల్లింది.

అయితే ఈ సాంగ్ లో ఒక చిన్న మైనస్ ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్.

అదేమిటంటే అనిరుద్ అందించిన బీట్ రామజోగయ్య శాస్త్రి( Ramajogayya Sastry ) లిరిక్స్ ని డామినేట్ చేస్తుంది.

సాధారణంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ చాలా బాగుంటాయి కానీ అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వలన ఆ లిరిక్స్ పెద్దగా వినిపించడం లేదు.

"""/" / నేటి రోజుల్లో అదే ట్రెండ్ అనుకునే వారికి ఏమీ పర్వాలేదు కానీ లిరిక్స్ కూడా వినాలి అనుకునే వారికి ఈ విషయం కొంత నిరాశను కలిగించిందనే చెప్పవచ్చు.

అయితే అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ ఇష్టపడే యూత్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టపడే ఫ్యాన్స్ ఈ విషయం పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్లు లేదు అందుకే సాంగ్ ని సూపర్ హిట్ చేశారు.

రజనీకాంత్ జైలర్ హుకుం సాంగ్ పేరు మీద ఉన్న రికార్డు ఈ సాంగ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు.

డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే పూరి కి ఆ స్టార్ హీరో డేట్స్ ఇస్తాడా..?