ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 17వ సీజన్( IPL 17 ) తుది దశకు చేరుకుంది.ప్లే ఆఫ్ చేరుకున్న నాలుగు టీమ్స్ ఆటగాళ్లు మినహాయించి మిగతా ఆడవాళ్ళందరూ వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు.
ఇందులో భాగంగానే తాజాగా మాజీ టీమిండియా కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ( Mahendra Singh Dhoni ) కూడా గడిచిన రెండు నెలలుగా ఐపీఎల్ 17వ సీసన్ సందర్భంగా బిజీబిజీగా గడిపిన అతను ప్రస్తుతం రిలాక్స్ మూడులోకి వచ్చేసాడు.ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) నిష్క్రమించడంతో ధోని మళ్లీ తన సాధారణ జీవితం వైపు కదిలాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరుకోవడంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా 27 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో ఓటమిపాలైన విషయం తెలిసిందే.దీంతో అవసరమైన రన్ రేట్ మెరుగ్గా ఉన్న ఆర్సీబీకి ప్లే ఆప్స్ చేరుకోగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంటిదారి పట్టింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థలం రాంచికి( Ranchi ) వెళ్లిన మహేంద్ర సింగ్ ధోని తాజాగా సోమవారం తన బైకుపై షికారులు కొడుతున్నాడు.హెల్మెట్ ధరించి ఓ యమహా బైక్ పై( Yamaha Bike ) ఒక్కడు సరదాగా షికారుకు వెళ్ళాడు.ఆ సమయంలో ఓ వ్యక్తి మహేంద్రసింగ్ ధోని బైక్ పై వెళ్తున్న వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన మహేంద్ర సింగ్ ధోని అవమానాలు తెగ ఫీదా అవుతున్నారు.ఇకపోతే మహేంద్రసింగ్ ధోని కచ్చితంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడన్న మీడియా చర్చలలో ప్రస్తుతం ధోని ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ధోని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మహేంద్ర సింగ్ ధోని మాత్రం అవేవీ పట్టించుకోకుండా చాలా హాయిగా టైం గడిపేస్తున్నాడు.ఇక ఐపీఎల్ 17వ సీజన్ లో మహేంద్రసింగ్ ధోని మొత్తం 14 మ్యాచ్లో ఆడి 220.55 స్ట్రైక్ గ్రేడ్ తో 161 పరుగులు చేశాడు.ఇకపోతే ధోని రిటైర్మెంట్ చెన్నైలో అభిమానుల మధ్య కావాలననుకున్నా నేపథ్యంలో అలా జరగడంతో ధోని నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.