ఇక మా కలలన్నీ నా కొడుకు కోసమే.. యామీ గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్( Yami Gautam ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Yami- Gautam Aditya Dhar Welcome Baby Boy Name Him Vedavid, Yami Gautam, Aditya-TeluguStop.com

యామీ గౌతమ్ సినిమాల ద్వారా కంటే కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.మరి ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది.

ఒకరకంగా చెప్పాలంటే యామి గౌతమ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ బ్యూటీ అంటే చాలు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఇకపోతే యామి గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి సినిమాల్లో నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా యామి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ వివరాల్లోకి వెళితే.

యామి గౌతమ్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్‌( Aditya dhar ) సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఆ బాబుకి వేదవిద్‌ అని నామకరణం చేసినట్టు ఆయన ఆ పోస్ట్‌లో తెలియజేశారు.

ఈ విషయం యామి గౌతమ్‌ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.ఇప్పటివరకూ ఒక ప్రయాణం.ఇక నుంచి మరో ప్రయాణం.

నా బిడ్డను తొలిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు.ఇక మా జీవితం వాడికోసమే.

మా కలలన్నీ వాడికోసమే.మా కుటుంబానికే కాక, దేశానికే గర్వకారణం అయ్యేలా వాడిని పెంచుతాను.

వాడెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను అని తెలిపింది యామి గౌతమ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube